Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 May 2023, 2:41 pm Posted by : Anjaneyulu Dega

ఆస్పత్రిలో కనీస వసతులు లేవు మహిళా కన్వీనర్ భవాని

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల  పట్టణంలోని ఆస్పత్రిలో గర్భిణులను, అనారోగ్యంతో వచ్చిన వారిని పట్టించుకునే నాధుడే లేడని బి. ఎస్. పి జోనల్ మహిళా కన్వీనర్ మద్దెల భవాని సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేక వచ్చిన పేషంట్లను పట్టించుకోక డాక్టర్లు సైతం వారిని పట్టించుకోకపోవడం నర్సులతో ట్రీట్మెంట్ చేయించడం శోచనీయకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దీనిపై స్పందించాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రతిదీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినప్పటికీ వారు పట్టించుకోకపోవడం, స్పందించకపోవడం పై వెంటనే చర్య తీసుకోవాలని బీఎస్పీ జోనల్ మహిళా కన్వీనర్ మద్దుల భవాని డిమాండ్ చేశారు.