Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 May 2023, 3:16 pm Posted by : Anjaneyulu Dega

కలెక్టరేట్ ఎదుట వృద్ధుని నిరసన

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన 70 సంవత్సరాలు గల మల్లయ్య అనే వృద్ధుడు తన ఇంటి ముందు రోడ్డు విస్తరణ గురించి గ్రామ సర్పంచ్ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ తన ఇంటికి వచ్చే నల్ల పైపులతో పాటు, మురికి కాలువ ధ్వంసం చేశారని తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్డీవో కు వినతిపత్రం ఇవ్వడంతో పాటుగా కలెక్టరేట్ ఆవరణలో అధికారుల నిర్లక్ష్య నిరసిస్తూ ప్ల కార్డుతో వృద్ధుడు నిరసన వ్యక్తం చేసారు. అనంతరం వృద్ధుడు మాట్లాడుతు. తన ఇంటి ముందు రోడ్డు విషయమై సర్పంచ్ గత మూడు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తన ఇంటికి వెళ్లే రహదారి ని జేసిబి సహాయంతో మూసివేసి ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా తనపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు..