
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నస్పూర్ లో నూతనంగా నిర్మించిన మంచిర్యాల కలెక్టరేట్ భవనాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం పరిశీలించారు. జూన్ 9న ముఖ్య మంత్రి కేసీఆర్ కలెక్టరేట్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పర్య వేక్షించారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.