Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 May 2023, 4:50 pm Posted by : Anjaneyulu Dega

భారాసతో నీతులు చెప్పించుకునే స్థితిలో భాజపా లేదు: కిషన్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారాసతో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో భాజపా లేదన్నారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారాస ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భారాసతో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో భాజపా లేదని ఆయన వ్యాఖ్యానించారు..