Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 May 2023, 2:12 pm Posted by : Anjaneyulu Dega

ఇడ్లిలో బల్లి.. సింగరేణి క్యాంటీన్ నిర్వాకం..!

ఆంజనేయులు న్యూస్, పెద్దపెల్లి జిల్లా: రామగుండం రిజియన్ లోని సింగరేణి సంస్థకు చెందిన క్యాంటీన్ నిర్వాకంతో ఉద్యోగులు ఇబ్బందులు పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సింగరేణి మైన్ లోని క్యాంటీన్ లో విధులకు హాజరైన కార్మికులు అల్పాహారం తీసుకున్నారు. వారికి వడ్డించిన ఇడ్లీలో బల్లి దర్శనమిచ్చింది. ఒక్కసారిగా ఖంగుతిన్న వారంతా ఇదేంటని క్యాంటీన్ నిర్వాహుకులను ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు బదులు ఇవ్వక పోగా. పొంతనలేని సమాధానాలతో దాటవేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చూడటం వల్ల విషయం బయటపడిందని. చూడకుండా అలాగే తింటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆదోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉద్యోగులు వెల్లడించారు..