కేంద్రం ఆర్డినెన్స్ పై దిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఈమేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: కేంద్రం ఆర్డినెన్స్ పై దిల్లీ సీఎం కేజ్రివాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తో ఆయన శనివారం హైదరాబాద్ లో భేటీ కానున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలను ఆయన కలిశారు. దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్ ను జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్ గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్ పేర్కొన్నారు