మహిళ హత్య కేసులో నిందితులు అరెస్ట్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన జనగామ స్వప్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, ఎసిపి తిరుపతి రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. హత్యకు పాల్పడిన వేల్పుల మధుకర్, వేల్పుల వెంకటి, వేల్పుల రాజేష్ తో పాటు సమాచారం ఇచ్చిన ఉల్లేందుల రాజమణిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేల్పుల మధుకర్ తో మృతురాలికి 2014లో రెండవ వివాహం జరిగింది....