Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 May 2023, 7:36 am Posted by : anjudega

రాజకీయాలను క్షలుషితం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచికి మారు పేరైన మంచిర్యాలలో రాజకీయాలను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కలుషితం చేస్తున్నారని మున్సిపల్, చైర్మన్ వెంట రాజయ్య ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మున్సిపల్ ద్వారా మధ్యాహ్నం భోజనం అందించాలని కౌన్సిల్ నిర్ణయించాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో భోజనాలు ప్రారంభించారని తెలిపారు. గాంధీ పార్కులో కాకుండా ఎక్కడ అన్నదానం చేసిన తమకు అభ్యంతరం లేదన్నారు. ఇప్పటి వరకు గాంధీ పార్కులో రాజకీయ సమావేశాలు, అన్నదానాలు చేయలేదని ఆయన తెలిపారు. ప్రజలను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.