Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 May 2023, 8:07 am Posted by : Anjaneyulu Dega

హత్య కేసును చేధించిన పోలీసులు

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఈ నెల 12న మందమర్రి పట్టణంలో జరిగిన లావుడ్య సాగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ పూర్తి వివరాలు వెల్లడించారు. కాసిపేట మండలంలోని మామిడిగూడెం గ్రామానికి మృతుడు సాగర్ ను బొడ్డు బాలాజీ అలియాస్ పూల బాలాజీ, నూనె వెంకటేష్, బోగ వెంకటేష్, అల్లంకుంట గణేష్ హత్య చేసినట్లు తెలిపారు. నిందితులను దీపక్ నగర్ లో పట్టుకొని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి మృతుని పల్సర్ బండి, నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, టాటా ఏస్ ట్రాలీ, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఎసీపీ సదయ్య, మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ జి. మహేందర్ రెడ్డి, ఎస్సై పి. చంద్ర కుమార్, హెడ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్, కానిస్టేబుళ్లు సంపత్, మహేష్, రవి, అనిల్ కుమార్, రాము, సురేందర్, హోంగార్డ్ ఆఫీసర్ రమేష్ లను డిసిపి అభినందించారు.