తనిఖీలు కరవు.. కల్తీల జోరు
జిల్లాలో వ్యాపారుల ఇష్టారాజ్యం కెరమెరి సంతలో రోడ్డుపక్కన చిరుతిళ్ల విక్రయాలు ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో ఆహార తనిఖీలు లేక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తిర్యాణి మండలంలో వారసంతలో మిరపకాయ బజ్జీలు తిని 38 మంది ఆసుపత్రి పాలయ్యారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ కు ఆహార తనిఖీల అధికారిని కేటాయించారు. సదరు అధికారి జిల్లాలో తనిఖీ చేసిన దాఖలాలు లేవు. ఇదే అదనుగా...