Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 May 2023, 3:54 pm Posted by : anjudega

వింత వ్యాధులతో బాధపడుతున్న పశువులు

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలంలో పశువులకు వింత వ్యాధి సోకింది. మండల కేంద్రంలో పశువులకు బొబ్బలు బొబ్బలుగా ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మండల కేంద్రంలో ప్రత్యేక పశు వైద్య క్యాంపు ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై బెజ్జూర్ ఇన్చార్జి పశు వైద్యాధికారి రాకేష్ ను సంప్రదించగా రైతులు పశువులకు బొబ్బలు జబ్బు వస్తున్నట్టు తమకు సమాచారం అందిస్తే వైద్యం చేస్తామని తెలిపారు. పశువులకు ఎలర్జీ వల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయని తెలిపారు.