Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 May 2023, 12:28 pm Posted by : Anjaneyulu Dega

ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు

బిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి గ్రామంలో మంగళవారం ఇంటింటికి బిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ గడప గడపకు వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ-అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతిక్షణం ప్రజల కోసం, ప్రజల మనిషి గా ముందుకు తీసుకురావడం జరుగుతుందని అందువలన ఆయన అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను సకాలంలో మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఇవ్వడమే మా పనిగా పెట్టుకొని రాత్రి పగలు మీకోసం కష్టపడుతున్నాము. ఎందుకంటే ప్రజలు లేనిది నేతలు లేరు–మీరు బాగుంటేనే మేం బాగుంటాము అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఏమైనా సమస్యలు ఉంటే చెప్పిన వెంటనే వాటిని పరిశీలిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.