సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన సలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమేశ్ కుమార్ ఈ పదవిలో 3ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా...