Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 May 2023, 2:46 pm Posted by : Anjaneyulu Dega

విఓఎ లకు ప్రెస్ క్లబ్ మద్దతు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలో గత కోన్ని రోజులుగా విఓఎ లు చేస్తున్న సమ్మెకు తాండూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ సంఘిభావం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా విలేఖరులు పని చేస్తారని అన్నారు.సమస్యలను ప్రభుత్వం ద్రృష్టికి తీసుకేళ్ళే క్రమంలో వివిధ పద్దతుల్లో న్యూస్ రాయడం మద్దతు తెలుపడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో కేసిఆర్ ఇచ్చిన హామీ విధంగా 10,000 జీతం పెంచలేదని నేటికీ 4 సంవత్సరాలు పుర్తయిందని రానుంది ఎన్నికల సమయం కాబట్టి విఓఎల డిమాండ్లు పరిష్కారం చేయాలని లేని ఎడల ప్రతి పక్షాలు ఈ సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ మే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళుతు ఎ మీటింగ్ లు జరిగిన మహిళల ను పెద్ద ఎత్తున తరలిస్తు శ్రమకు తగ్గ వేతనం లేకుండా కుటుంబాన్ని పోషించడం కష్ట మవుతుందన్నారు.విఓఎల డిమాండ్స్ సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస గౌరవ వేతనం 26000/- ఇప్పించాలి, ఎస్ హెచ్ జీ లైవ్ మీటింగ్స్ గ్రేడింగ్ లతో సంబందం లేకుండా వేతనాలు ఇవ్వాలి, సెర్చ్ ద్వారా ఐడి కార్డ్స్ ఇప్పించాలి. ఆరోగ్య భీమా & జీవిత భీమా 10 లక్షలు కల్పించాలి, అర్హత కల్గిన వారికి సిసీ లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సంయుక్త కార్యదర్శి  కొడిమాలశ్రీకాంత్, శనిగారపు వినోద్ సిద్ధం శేట్టి పవన్ కుమార్, గందే సత్యనారాయణ, విఓఎ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు..