Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 April 2023, 5:20 pm Posted by : anjudega

జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి.

గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున ఐబీ చౌరస్తా ఆవరణలో తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ &  ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు అవునూరి సాగర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దడంలో, పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర చాలా కీలకం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తుంది. పని ప్రాంతంలో కార్మికులకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వ స్పందించక పోవడం చాలా దారుణం. రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో పంచాయతీ కార్మికులు ప్రమాదానికి గురై చనిపోతే కనీసం ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించి ఏలాంటి న్యాయం చేయలేదు. చనిపోయిన కార్మికుల కుటుంబానికి దిక్కేవరు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం…? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం..? రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయి. మల్టీ వర్కర్స్ విధానంతో పనిభారం  పెరుగుతూ, కార్మికులు అనారోగ్య బారిన పడుతు, ప్రమాదలకు గురవుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలి. కార్మికులకు ఇచ్చే నూనె, సబ్బులు, బెల్లం,చెప్పులు, యూనిఫామ్ లు వెంటనే చెల్లించాలి. పిఎఫ్ ఈఎస్ఐ మరియు ఉద్యోగ భద్రత సౌకర్యాలు,20 లక్షల ప్రమాద బీమా సౌకర్యాలు వెంటనే కల్పించాలి. ముఖ్యంగా మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. కార్మికుల పైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజా ప్రతినిధుల వేధింపులు అరికట్టాలి. పైన పేర్కొన్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో గ్రామపంచాయతీ కార్మికులు చేసే పోరాటానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. అనంతరం 18 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దాసరి సురేష్ నూతన జిల్లా అధ్యక్షులు, చిన్నన్న జిల్లా కోశాధికారి, చందు జిల్లా కార్యదర్శి , సుధాకర్, సంపత్ జిల్లా ఉపాధ్యక్షులు, సాయి కృష్ణ, ప్రశాంత్ జిల్లా సహయ దర్శులతో ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది.