అందిన కాడికి దోచుకున్న మోసగాళ్ళు
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: పట్టణానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 1.95 లక్షలు దోచుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి గతనెల 19న అపరిచిత నంబర్ ద్వారా ఫోన్ వచ్చింది. అసభ్యంగా మాట్లాడటంతో ఆయన ఉచ్చులో పడ్డాడు. మరుసటి రోజు ఓ మహిళ డీపీతో ఉన్న నంబరు నుంచి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. అందులో ఆమె నగ్నంగా ఉండటంతో వెంటనే కాల్ కట్ చేశాడు. కొంతసేపటి తర్వాత మరో నంబర్లో కాల్...