Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 11 April 2023, 2:52 pm Posted by : Anjaneyulu Dega

కేరామెరిలో అరుదైన శిలల గుర్తింపు

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కెరమెరి మండలంలోని మారుమూల రాంనగర్, గౌరి గ్రామాల అడవుల్లో పురాతనమైనప్పటికీ అరుదైన స్థూపాకార బసాల్ట్ ను కనుగొన్నామని చరిత్రకారుల స్వతంత్ర సంస్థ కొత్త తెలంగాణ చరిత్ర బృందం (కేటీసీబీ) సభ్యులు మంగళవారం తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని రాంనగర్, గౌరి గ్రామాల అటవీ ప్రాంతాల్లో కాలమ్నార్ బసాల్స్ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. తమ బృందం సభ్యుడు తిరుపతి గిత్తే వాటిని గుర్తిం చారని, బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రిందట భూగర్భంలోని రంధ్రాల ద్వారా పైకి వచ్చిన లావా, గట్టిపడ్డాక ఏర్పడిన శిలల రూపాలనే కాలమ్నార్ బసాల్ట్స్ పిలుస్తారని పేర్కొన్నారు. దేశంలోని చాలా చోట్ల ఇవి కనిపించినా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించినవి అరుదైనవని అన్నారు..