ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డితో కలిసి సందర్శించి ఆసుపత్రిలోని పలు వార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఐ.సి.యు. వార్డులలో సిబ్బందిని ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలలో...