Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 March 2023, 3:50 pm Posted by : Anjaneyulu Dega

సీపీఐ బాడీ సమావేశంను జయప్రదం చేయండి.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవెన శంకర్

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఈ నెల 26వ తేదీన మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్ నుండి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మోటార్ బైకు ర్యాలీతో ప్రారంభమై న్యూ నస్పూర్ కమిటీ హాల్లో సభ జరుగుతుంది కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పార్టీ, ట్రేడ్ యూనియన్, విద్యార్థి, యువజన, మహిళ సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవెన శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని శంబశివరావు హాజరవుతారని కావున ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని సిపిఐ పార్టీ నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులు విద్యార్థి యువజన, మహిళా నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రెండవసారి అధికారులకు వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ పై సమగ్ర విచారణ చేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు, రైతులందరికీ ఉచితంగా ఎరువులు ఇవ్వాలని, దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద పార్టీ అయినా బిజెపిని అంతం చేయడానికి కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు బోగే ఉపేందర్, ఆత్మకూరు చిరంజీవి తో పాటు తదితరులు పాల్గొన్నారు..