Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 March 2023, 7:50 pm Posted by : Anjaneyulu Dega

కూలీ అవతారమెత్తిన సర్పంచ్

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: ఇలా బస్తాలు భుజాన మీద మోసుకుంటూ పోయేది ఎవరో కూలి వాడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే,. ఇతను ఎవరో కాదు గ్రామ సర్పంచ్, పేరుకు మాత్రమే సర్పంచ్. ఇంటి నిండా అప్పులే ఎలా అంటారా. తన సొంత డబ్బులు, అప్పులు చేసి గ్రామ అభివృద్ధి చేశాడు. కాని ఇప్పుడు వాటి బిల్లులు రాక అప్పుల భారం పెరిగి ఇల్లు గడవక ఇలా కూలొ అవతారం ఎత్తాడు. కౌటాల మండలం తాటినగర్ గ్రామ సర్పంచ్ రత్నం సోమయ్య ఇలా కూలీ అవతారమెత్తారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేకపోవడంతో పలు అభివృద్ధి పనులు చేసినా వాటికి బిల్లులు రాక అప్పులు పెరిగిపోయాయి. కుటుంబ పోషణ భారమై హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆయన తెలిపారు. ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి బిల్లులు విడుదల చేయాలన్నారు.