
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది తీరంలో ఇసుక రీచ్ ను శనివారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ తో మధుసూదన్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రస్తుతం వేంపల్లి గోదావరి నదిలో రీచ్ ప్రారంభం కావడంతో అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుక లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, జెడ్పిటిసీ శిల్ప శ్రీనివాస్ రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, సర్పంచ్ వోలపు శారద రమేష్, తదితరులు పాల్గొన్నారు..