సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పాదయాత్రలు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బిజెపి హటావో భారత్ బచావో నినాదంతో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుండి మే 14 వరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా పాదయాత్రలు చేయనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం మంచిర్యాలలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ గ్రామాన ఇంటింటికీ వెళ్లి బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశాన్ని మతోన్మాదుల చేతి నుండి రక్షించుకోవడం కోసం ముందుకు సాగుతామని తెలిపారు....