
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బిజెపి హటావో భారత్ బచావో నినాదంతో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుండి మే 14 వరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా పాదయాత్రలు చేయనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం మంచిర్యాలలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ గ్రామాన ఇంటింటికీ వెళ్లి బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశాన్ని మతోన్మాదుల చేతి నుండి రక్షించుకోవడం కోసం ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, 2014 నుండి పేదవారికి పక్కా ఇండ్లు మంజూరు కాలేదని ఆరోపించారు. ఇండ్లు లేని వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీ ఖాన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, తదితరులు పాల్గొన్నారు..