Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 March 2023, 4:52 pm Posted by : Anjaneyulu Dega

గ్రీన్ వుడ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రీన్ వుడ్ పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా సీబీఎస్ ఈ విద్య పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుందని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యాశాఖ జిఓ నెంబర్ 1 నిబంధనలకు తూట్లు పొడుస్తూ అమాయక తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి గ్రీన్ వుడ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, రేగుంట క్రాంతి కుమార్, పురేళ్ళ నితీష్, బచ్చలి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.