సీపీ ఫ్లెక్సీకీ రైతులు క్షీరాభిషేకం

ఆంజనేయులు న్యూస్, వరంగల్ జిల్లా: తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్ బీ ఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018 లో అమ్మినట్లు...