Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 March 2023, 4:45 pm Posted by : Anjaneyulu Dega

గొంతు కోసుకొని ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక ట్రాన్స్ జెండర్, యువతి కత్తితో గొంతుకోసుకోగా ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే. జిల్లా కేంద్రంలోని విద్యా నగర్ లో కలిసి నివాసం ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రాన్స్ జెండర్ మహేశ్వరి, అంజలి అనే యువతి రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో అంజలి మృతి చెందగా, మహేశ్వరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తమ బిడ్డది ఆత్మహత్య కాదని గొంతు కోసి హత్య చేశారని అంజలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. అంజలిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.