డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పోలీసులపై దాడి

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: పీకలదాకా మద్యం సేవించిన ఓ యువకుడు అతని మిత్రుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులపైనే దాడికి దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తనిఖీలు చేపట్టిన పోలీసులపైనే దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి రోడ్ లో మంగళవారం రాత్రి ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేపట్టారు....