Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 March 2023, 2:44 pm Posted by : Anjaneyulu Dega

కాలిపోయిన స్థితితో మృతదేహం లభ్యం… హత్యగా అనుమానాలు

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: కొండగట్టు జాతీయ రహదారి సమీపంలో ముక్కలు ముక్కలుగా పూర్తిగా కాలిపోయిన మృత దేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతదేహం పై ఆనవాళ్లను బట్టి వ్యక్తి మృత దేహంగా గుర్తించామన్నారు. అతన్ని హత్య చేసిన తర్వాత కాల్చివేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం ఎముకలు మాత్రమే కనిపిస్తుండగా ఈ హత్య మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మల్యాల సీఐ రమణ మూర్తి, కొడిమ్యాల్ ఎస్ఐ వెంకట్ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.