విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని విద్యార్థినీ విద్యార్థులు పట్టుదలతో చదివి వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, సాయి కుంటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతిగృహం, షెడ్యూల్డ్ కులముల బాలుర వసతిగృహం, షెడ్యూల్ తెగల బాలుర వసతి గృహాలను ఆకస్మిక...