మహిళల సాధికారత తోనే సృష్టి మనుగడ
అంజనేపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళలతోనే సృష్టి మనుగడ, మహిళా సాధికరత జరుగుతుందని అంజనేపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని సున్నం బట్టివాడ లో మహిళలను సన్మానించారు. అనంతరం అంజనీపుత్ర సంస్థ ఎండీ పిల్లిరవితో కలిసి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళతోనే సృష్టి మనుగడ జరుగుతుందని, మహిళలపై వివక్షత లేకుండా అన్ని రంగాలలో వారిని ప్రోత్సహించాలని...