Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 March 2023, 11:06 pm Posted by : Anjaneyulu Dega

మహిళల సాధికారత తోనే సృష్టి మనుగడ

అంజనేపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళలతోనే సృష్టి మనుగడ, మహిళా సాధికరత  జరుగుతుందని అంజనేపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని సున్నం బట్టివాడ లో మహిళలను సన్మానించారు. అనంతరం అంజనీపుత్ర సంస్థ ఎండీ పిల్లిరవితో కలిసి  కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళతోనే సృష్టి మనుగడ జరుగుతుందని, మహిళలపై వివక్షత లేకుండా అన్ని రంగాలలో వారిని ప్రోత్సహించాలని అన్నారు. కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుండి దేశ అభివృద్ధిలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని, అన్ని రంగాలలో వారికి సముచిత స్థానం కల్పిస్తే దేశం తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, న్యాయ మూర్తులు, రాజకీయం అనేక రంగాలలో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారని, వారిని మరింత ప్రోత్సహిస్తే దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తారని అన్నారు. వారు మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి  ఇబ్బందులు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లా ల్లోని అంజనీపుత్ర శాఖలలో పని చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రాల శ్రీధర్, పిల్లి రవి, జీ.సంతోష్, ఎస్ కిషన్, డి.తిరుపతి, జి.సురేష్, పి.వెంకన్న, కె.సదానందం, కె.రాజా, జి.కిరణ్, ఐ.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.