నోట్ల గుట్టలు దొరికిన ఎమ్మెల్యే సంగతేంటి.? మోదీకి కేజ్రీవాల్ ప్రశ్న
కర్ణాటక భాజపా ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో అరవింద్ కేజ్రివాల్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియా అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న దిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూటి ప్రశ్న వేశారు. కర్ణాటక లో భాజపా ఎమ్మెల్యే కుమారుడి 'లంచావతారం' ఘటనను ఉదహరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏమీ లేని సిసోదియాపై అన్ని కేసులు పెట్టినప్పుడు.. నోట్ల గుట్టలు దొరికిన భాజపా ఎమ్మెల్యేను అరెస్టు...