Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 March 2023, 8:46 pm Posted by : Anjaneyulu Dega

మినీ లెదర్ పార్క్ ను పున ప్రారంభించాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మందమర్రి మినీ లేదర్ పార్క్ పునః ప్రారంభించి నిరుద్యోగత ను నిర్మూలించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మంగళవారం డిమాండ్ చేశారు. మినీ లేదర్ పార్క్ కోసం ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఆ క్రమంలో ఉపాధి దొరుకుతుందని ఆశతో 6700 మంది దరఖాస్తు చేసుకున్నారు. 300 మందికి శిక్షణ కూడా ఇచ్చారురెండో దశ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న వారికి మధ్యలోనే ఆపేశారు అప్పటినుంచి నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడం వలన ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు ఆవిరైపోయాయి తెలంగాణ రాష్ట్రంలో దళితులకు న్యాయం చేయడంలో ఈ తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మినీ లెదర్ పార్క్ నీ ప్రారంభించకపోతే. వైయస్సార్ తెలంగాణ పార్టీ అదినేత్రి వైయస్ షర్మిల అక్క దృష్టికి తీసుకువెళ్లి లెదర్ పార్క్ ఓపెన్ చేసేదాకా కృషి చేస్తాం, దానికోసం నిరాహార దీక్షలు చేయడానికి అయినా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్, దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ యువజన విభాగం మండల అధ్యక్షుడు జావిద్ పాషా, చరణ్ సుధీర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.