Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 March 2023, 9:31 pm Posted by : Anjaneyulu Dega

మొక్కలు నాటుదాం ప్రకృతి సంపాదన కాపాడుకుందాం.

మొక్కలు నాటుదాం ప్రకృతి సంపాదన కాపాడుకుందాం.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా,మార్చి,06:రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కొనసాగుతుంది.ఇందులో భాగంగా సోమవారం కేశంపేట జెడ్పిటిసి సభ్యులు శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,,,పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి ఎంతో పరవశించిపోతుందన్నారు.తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ,జాగ్రత్త అద్భుతమని,అంతే ప్రేమతో మహిళాలోకం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న పాల్గొని మొక్కలు నాటి,వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు…