
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం దళిత జర్నలిస్ట్ మహాసభల పోస్టర్లను జర్నలిస్ట్ సంఘాల నాయకులు పార్వతి రాజేష్, సురేష్, దళిత జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మాసు రాకేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాసు రాకేష్ మాట్లాడుతూ. కలంతో నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్ట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలని అన్నారు. జర్నలిస్ట్ వృత్తిని నమ్ముకొని దశాబ్దాల కాలంగా విలేకరులుగా పని చేస్తున్న వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు అందించాలని, దళిత జర్నలిస్ట్లకు దళిత జర్నలిస్ట్ బందు పథకాన్ని వర్తింప చేయాలని కోరారు. ఈ నెల 9వ తేదీన జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్ట్ మహా సభలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని దళిత జర్నలిస్ట్లు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు ఆవుల శ్రీధర్, జర్నలిస్ట్లు రవి, ప్రేమ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు