Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 March 2023, 8:13 pm Posted by : Anjaneyulu Dega

మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ గా డా॥ తోట ప్రవలిక ఎన్నిక.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హైదరాబాద్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్‌లో జరిగిన మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశం సొసైటీ వ్యవస్థాపకులు, తెలంగాణ మున్నూరుకాపు అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం పటేల్‌ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో సంఘం విధి విధానాలు రూపొందించి కార్యాచరణ ప్రకటించారు. సొసైటీలో రాష్ట్ర చైర్మన్‌, వైస్ చైర్మన్ సహా మొత్తం 45 మంది డైరెక్టర్లు ఎన్నుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్ మంచిర్యాల జిల్లా కు చెందిన డాక్టర్ తోట ప్రవలిక ఎన్నికైనారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఈ సొసైటీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను మహిళలకు అందేలా చూస్తూ, ఆర్ధికంగా నిలబెడతామని స్పష్టం చేశారు. మహిళలకు నచ్చిన పనుల్లోనే శిక్షణ ఇచ్చి, స్వశక్తితో పైకి ఎదిగేలా ఆర్ధికంగా నిలబెట్టి, ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు తమవంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సొసైటీ ద్వారా మహిళలు స్వయం ఉపాధిని సాధించి సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని గడపాలని వారు సూచించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. సమావేశంలో మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్లకు నియామక పత్రాలను, గుర్తింపుకార్డులను కూడా అందజేశారు. నాపై నమ్మకంతో రాష్ట్ర డైరెక్టర్ గా నియమితులు జారీ చేసినందుకు పెద్దలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతు మున్నూరు కాపు మహిళల అభివృద్ధి కి కృషి చేస్తానని ఆమే తెలిపారు..