Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 March 2023, 2:42 pm Posted by : Anjaneyulu Dega

సామాజిక మాధ్యమంలో తొలిరాత్రి దృశ్యాలు: భర్తకు కటకటాలు

తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలను చిత్రీకరించిన ఉన్మాద. భర్త.. వాటిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం కలకలం రెపింది.

ఆంజనేయులు న్యూస్, కోనసీమ జిల్లా: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా.. అని సభ్యసమాజం తలదించుకునేలా, భార్య ఆత్మగౌరవం దెబ్బతినేలా తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలను చిత్రీకరించిన ఉన్మాద భర్త.. వాటిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో జరిగిన ఈ ఘటనతో అతను కటకటాలపాలయ్యాడు. ఫిబ్రవరి 8న ఆ యువకుడి(20)కి గ్రామానికే చెందిన బాలిక(17)తో వివాహమైంది. అతడు తమ మొదటి రాత్రి దృశ్యాలను సామాజిక మాధ్యమంలో ఉంచాడు. విషయం తెలిసి.. బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆ యువకుడిని గత నెల 28న అరెస్టు చేశారు. కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించారని కాట్రేనికోన ఎస్సై టి. శ్రీనివాస్ బుధవారం తెలిపారు. అయితే.. తొలుత బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడగా, అధికార పార్టీ ప్రాబల్యం ఉన్న ఆ గ్రామ పెద్దలు ప్రైవేటు పంచాయితీ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించినట్లు సమాచారం.