పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి..
సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో బుధవారం ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసింది. నిమ్స్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి నిమ్స్ చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా)...