Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 February 2023, 10:24 pm Posted by : Anjaneyulu Dega

తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ లపై ఫిర్యాదు

ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ మండల తహసీల్దార్, మునిసిపల్ కమిషనర్ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆడిషనల్ కలెక్టర్ చాహాత్ బాజపాయికి సిర్పూర్ బిఎస్పీ పార్టీ ఇంచార్జ్ అర్షద్ హుస్సేన్ ఫిర్యాదు చేశారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని అడీషనల్ కలెక్టర్ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కాగజ్నగర్ తహసీల్దారు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడని, అధికార నాయకుల అండదండలతో అవినీతికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే తహశీల్దారు ను, మున్సిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.