పుట్టగొడుగుల్లా.. అక్రమ వెంచర్లు!
ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట వెళ్లే మార్గంలో వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల్లో వెంచర్ వెలిసింది. రహదారి పక్కనే ఈ ప్లాట్లు ఉండడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. సాగు భూములు, ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికం.. ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పంటలు పండే సాగు భూములను, క్రయ విక్రయాలకు వీల్లేని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వెలుస్తున్నా.. సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైసా పైసా కూడబెట్టి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన వారు మోసపోతున్నారు. బీడీపీపీ, ఇనాం భూములు, అసైన్డ్ భూములు ప్లాట్లుగా...