ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే చిన్నయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దేశ, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాలకే కమ్యూనిష్టు పోరాటం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అహాంకార వైఖరితో అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని భారత కమ్యూనిష్టు పార్టీకి క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని...