డబుల్ బెడ్రూమ్ పథకం. సొంత స్థలాల వారికి గుడ్ న్యూస్
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: రాష్ట్రంలో సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే వచ్చేఏడాదికి డబుల్ బెడ్రూమ్ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు ప్రభుత్వం శాసనసభకు వెల్లడించింది. ప్రభుత్వం ఇంతవరకు 2.75 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయగా దాదాపు 1.37 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 53, 984 ఇళ్ల నిర్మాణం 90 శాతం...