విధి నిర్వహణలో బాధ్యత, నిబద్ధత అవసరం
రామగుండం సిపి రెమా రాజేశ్వరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పోలీసులు విచక్షణ, విజ్ఞతలతో, మానవీయ కోణంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, వృత్తి నైపుణ్యత, శాస్త్రీయ పరిశోధనతో నిష్ణాతులు కావాలని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి గెస్ట్ హౌస్ లో రామగుండం కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఎసిపి, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారుల పరిధిలోని ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు,...