Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 February 2023, 2:52 pm Posted by : Anjaneyulu Dega

డిపిఆర్ఒ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) భీమ్ కుమార్ పై జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి విజిట్ కు వెళ్లిన కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రోగ్రాం కవరేజ్ కోసం వచ్చిన నమస్తే తెలంగాణ పత్రిక కెమెరామెన్ రాజ్ కిరణ్ ఫొటోలు తీస్తుండగా డిపిఆరో భీమ్ కుమార్ కెమెరామెన్ చేతిలోని కెమెరాను లాగేసుకునే యత్నం చేసాడు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలిసి డీపీఆరో పై ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. తరచూ తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీడియో గ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.