Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 February 2023, 3:14 pm Posted by : Anjaneyulu Dega

కలెక్టర్ ను కలిసిన ఎస్పీ

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలిశారు. ఇటీవల బదిలీ పై వచ్చి ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాహుల్ రాజ్ ను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పూల ను అందించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతలు, తదితర అంశాలపై కలెక్టర్ కు ఎస్పీ వివరించారు. ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాలలో దేశంలోనే ఐదవ స్థానాన్ని పొంది, రాష్ట్రంలో మొదటి స్థానాన్ని పొందిందని తెలియజేస్తూ జిల్లా ప్రజలు సురక్షితంగా, ఎటువంటి సమస్యలకైనా పోలీసులను ఆశ్రయించవచ్చని నమ్మకంతో, ప్రశాంత వాతావరణంలో ఉన్నారని తెలియజేశారు.