దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ: గవర్నర్ తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై మాట్లాడారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారిందని ఆమె కొనియాడారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: దేశానికి అన్నంపెట్టే స్థాయికి చేరి తెలంగాణ ఆదర్శంగా మారిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రజాకవి కాళోజీ వాక్కులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని కాళోజీ...