సమిష్టిగా కృషి చేసి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచుదాం.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాను అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,...