
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన జునుగురి భారతి తాను గ్రామ శివారులోని భూమిలో కాస్తుదారులుగా 1991 నుండి కొనసాగుతుండని ఇట్టి భూమికి వేరొకరికి పట్టా పాసు పుస్తకం జారీ చేశారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమారం మండల కేంద్రానికి చెందిన గాలిపెల్లి లత తనకు భీమారం శివారులో భూమి ఉండి పట్టాదారు పాన్పుస్తకం కలిగి ఉన్నానని, తన భూమిలోకి అక్రమంగా చొరబడి కబ్జాకు పాల్పడి తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన జునుగురి దుర్గయ్య, జునుగురి శంకరయ్య, జాడి రెడ్డి, జాడి శివలింగు తాము దాదాపు 17 మంది రైతులము కవ్వాల్ శివారులోని భూమిలో 1975లో డిక్రీ పొంది అప్పటి కాస్తుదారులుగా ఉన్నామని, ఈ విషయమై పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.