మాజీ ఎమ్మెల్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అధికార పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందడంతో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాలతో...