తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు: తమిళిసై

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని పేర్కొన్నారు. ఆంజనేయులు న్యూస్, పుదుచ్చేరి: తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈమేరకు పుదుచ్చేరిలో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. "ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చింది. గణతంత్ర...